బాబు వెనుకే తమన్
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:55 AM
పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబు వెంటే సంగీత దర్శకుడు తమన్ ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రాకముందే తమన్ వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. కొంత సమయానికే వెలుపలకు వచ్చి అఖిలాండం నుంచి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం కుటుంబసభ్యులతో కలిసిపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్ నుంచి తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. సాధారణంగా ఇలా బయోమెట్రిక్ నుంచి ప్రవేశించడం నిషేధం. అయితే వీవీఐపీతో వచ్చిన కొందరికి ఈ వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీసింది.
తిరుమల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి) :పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబు వెంటే సంగీత దర్శకుడు తమన్ ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రాకముందే తమన్ వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. కొంత సమయానికే వెలుపలకు వచ్చి అఖిలాండం నుంచి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న సీఎం కుటుంబసభ్యులతో కలిసిపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్ నుంచి తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. సాధారణంగా ఇలా బయోమెట్రిక్ నుంచి ప్రవేశించడం నిషేధం. అయితే వీవీఐపీతో వచ్చిన కొందరికి ఈ వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లడం విమర్శలకు దారి తీసింది.