తిరుపతికి ‘ఉగ్ర’ బెదిరింపులు
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:39 AM
ఐఎ్‌సఐ, ఎల్టీటీఈ పేలుళ్లకు కుట్రపన్నాయి ఉగ్రవాదుల పేరిట తిరుపతికి బెదిరింపులు వచ్చాయి. ‘పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పాకిస్టాన్ ఐఎ్‌సఐ, ఎల్టీటీఈ పేలుళ్లకు కుట్ర పన్నాయి. నాలుగు చోట్ల ‘ఆర్డీఎక్స్ ఐఈడీ’ పేలుడు పదార్థాలు త్వరలో పేలనున్నాయి. శుక్రవారం ఈ పేలుళ్లు జరగనున్నాయి’ అంటూ శబరీశన్ వేదమూర్తి పేరిట టీటీడీ డోనార్ సెల్‌కు మెయిల్స్ వచ్చాయి. తమిళనాడులోని ప్రముఖులకూ బాంబు బెదిరింపులు రావడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో రిజర్వు, పారా మిలటరీ, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్టీఎ్‌ఫతో పాటు తిరుమల విజిలెన్సు అధికారులూ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో తిరుపతితో పాటు తిరుమలను దాదాపు ఆరు గంటల పాటు జల్లెడ పట్టారు. అన్ని ప్రాంతాల్లోను, ప్రతి లగేజీ వస్తువులు, బ్యాగ్‌లు క్షుణంగా తనిఖీలు చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సీఐ నేతృత్వంలో ఏఎ్‌సఐ రమేష్, సిబ్బంది చాంద్‌భాషా, సిబ్బంది కలసి తిరుమల, తిరుపతిలో గాలించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని తేల్చారు. ఇదంతా ఉత్తుత్తి బెదిరింపుగా భావించారు. అ అయినప్పటికీ భద్రతా చర్యలను కొనసాగించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి గుడి, తిరుమలలోని మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం.. ఇలా అన్ని పుణ్యక్షేత్రాల్లో తనిఖీలు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కళాశాల హెలిపాడ్‌తో పాటు నారావారిపల్లెలోనూ బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఊహాగానాలు నమ్మొద్దు: ఎస్పీ ‘ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. అపోహలు, ఊహాగానాలను నమ్మకండి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
పుణ్యక్షేత్రాల్లో ముమ్మరంగా తనిఖీలు
ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చిన బీడీ టీమ్‌లు
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఐఎ్‌సఐ, ఎల్టీటీఈ పేలుళ్లకు కుట్రపన్నాయి ఉగ్రవాదుల పేరిట తిరుపతికి బెదిరింపులు వచ్చాయి. ‘పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పాకిస్టాన్ ఐఎ్‌సఐ, ఎల్టీటీఈ పేలుళ్లకు కుట్ర పన్నాయి. నాలుగు చోట్ల ‘ఆర్డీఎక్స్ ఐఈడీ’ పేలుడు పదార్థాలు త్వరలో పేలనున్నాయి. శుక్రవారం ఈ పేలుళ్లు జరగనున్నాయి’ అంటూ శబరీశన్ వేదమూర్తి పేరిట టీటీడీ డోనార్ సెల్‌కు మెయిల్స్ వచ్చాయి. తమిళనాడులోని ప్రముఖులకూ బాంబు బెదిరింపులు రావడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో రిజర్వు, పారా మిలటరీ, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్, ఎస్టీఎ్‌ఫతో పాటు తిరుమల విజిలెన్సు అధికారులూ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో తిరుపతితో పాటు తిరుమలను దాదాపు ఆరు గంటల పాటు జల్లెడ పట్టారు. అన్ని ప్రాంతాల్లోను, ప్రతి లగేజీ వస్తువులు, బ్యాగ్‌లు క్షుణంగా తనిఖీలు చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సీఐ నేతృత్వంలో ఏఎ్‌సఐ రమేష్, సిబ్బంది చాంద్‌భాషా, సిబ్బంది కలసి తిరుమల, తిరుపతిలో గాలించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని తేల్చారు. ఇదంతా ఉత్తుత్తి బెదిరింపుగా భావించారు. అ అయినప్పటికీ భద్రతా చర్యలను కొనసాగించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి గుడి, తిరుమలలోని మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం.. ఇలా అన్ని పుణ్యక్షేత్రాల్లో తనిఖీలు చేపట్టారు. సీఎం పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కళాశాల హెలిపాడ్‌తో పాటు నారావారిపల్లెలోనూ బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఊహాగానాలు నమ్మొద్దు: ఎస్పీ
‘ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. అపోహలు, ఊహాగానాలను నమ్మకండి’ అని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.