Share News

దేవుడ్ని చూడగానే కళ్లల్లో నీళ్లొచ్చాయి

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:01 AM

‘దేవుడ్ని చూడగానే కళ్లలోంచి నీళ్లు తన్నుకుని వచ్చాయి. గొప్ప సంతోషంతో మనసు నిండిపోయింది. అదొక దివ్యానుభూతి’ అని తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం తర్వాత బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అన్నారు.

దేవుడ్ని చూడగానే కళ్లల్లో నీళ్లొచ్చాయి
అనుపమ్‌ ఖేర్‌

‘దేవుడ్ని చూడగానే కళ్లలోంచి నీళ్లు తన్నుకుని వచ్చాయి. గొప్ప సంతోషంతో మనసు నిండిపోయింది. అదొక దివ్యానుభూతి’ అని తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం తర్వాత బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ అన్నారు. శుక్రవారం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, స్వామిని చూసి బయటకు వచ్చిన తర్వాత మనసు మొత్తం దేవుడి ప్రేమ, రూపం నిండిపోయాయన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసిన అలంకరణలు చాలా బాగున్నాయన్నారు. కాగా, అంతకుముందు సినీనటి వాసుకీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 27 , 2025 | 02:01 AM