శివశంకర్‌రెడ్డి దంపతులకు కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:30 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా నారేడుమిల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతులకు ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
- అంత్యక్రియలు నిర్వహించిన తనయుడు
పలమనేరు, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి) : అల్లూరి సీతారామరాజు జిల్లా నారేడుమిల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పలమనేరుకు చెందిన శివశంకర్‌రెడ్డి, సునంద దంపతులకు ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శనివారం సాయంత్రం వారి భౌతికకాయాలు పలమనేరుకు చేరుకున్నాయి. ఆదివారం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం పెద్దపంజాణి మండలం లింగాపురం సమీపంలోని పొలం వద్ద శివశంకర్‌రెడ్డి తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు. వారి తనయుడు సాయివెంకట్ అంత్యక్రియలు నిర్వహించాడు.