నేటి నుంచి టీచర్ల యాప్‌డౌన్
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:19 AM
బోధనేతర పనులు తగ్గించాలని డిమాండు చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి పాఠశాలల్లో యాప్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఫ్యాప్టో నాయకులు గురువారం డీఆర్వో మోహన్‌కుమార్‌కు, డీఈవో వరలక్ష్మికి, మండల స్థాయి నాయకులు ఎంఈవోలకు నోటీసులు ఇచ్చారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం పనులు మినహా బోధనేతర కార్యక్రమాలను తాము చేయమన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం, గూగుల్ షీట్లు నింపడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 ప్రచారం నిలిపేస్తున్నట్లు ఫ్యాఫ్టో నాయకులు వివరించారు.ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ మణిగండన్, ప్రధాన కార్యదర్శి మునీర్, నాయకులు చెంగల్రాయ మందడి, జీవీ రమణ, మదనమోహన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, జగదీష్, ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
... బోధనేతర పనులు తగ్గించాలని డిమాండు
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):బోధనేతర పనులు తగ్గించాలని డిమాండు చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి పాఠశాలల్లో యాప్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఫ్యాప్టో నాయకులు గురువారం డీఆర్వో మోహన్‌కుమార్‌కు, డీఈవో వరలక్ష్మికి, మండల స్థాయి నాయకులు ఎంఈవోలకు నోటీసులు ఇచ్చారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం పనులు మినహా బోధనేతర కార్యక్రమాలను తాము చేయమన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం, గూగుల్ షీట్లు నింపడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 ప్రచారం నిలిపేస్తున్నట్లు ఫ్యాఫ్టో నాయకులు వివరించారు.ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ మణిగండన్, ప్రధాన కార్యదర్శి మునీర్, నాయకులు చెంగల్రాయ మందడి, జీవీ రమణ, మదనమోహన్‌రెడ్డి, కిరణ్‌కుమార్, జగదీష్, ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.