Share News

పోక్సో కేసులో టీచరు అరెస్టు

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:23 AM

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో బాలికను వంచించాడు. మూడేళ్లుగా మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది.

పోక్సో కేసులో టీచరు అరెస్టు
పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు

తిరుపతి (నేరవిభాగం), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో బాలికను వంచించాడు. మూడేళ్లుగా మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. ఈస్ట్‌ సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. తిరుపతి వైకుంఠపురానికి చెందిన చెన్నంపల్లి జలపతిరెడ్డి (వీవీ) నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఓ బాలికను వంచించాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ ఉపాధ్యాయుడు తరచూ అఘాయిత్యానికి పాల్పడేవాడు. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్‌ చదువుతోంది. ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు జలపతి రెడ్డిపై పోలీసులు పోక్సో, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం అరెస్టు చేసి నగరంలోని రోడ్లపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసును డీఎస్పీ భక్తవత్సలం దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 12 , 2025 | 01:23 AM