గురి తప్పని తరునీష్
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:11 AM
ఇష్టపడిన రంగంలో కష్టపడితే ఫలితాలెలా ఉంటాయో నిరూపిస్తున్నాడు తరునీష్ జత్యా. తనకు నచ్చిన విలువిద్యపై ఫోకస్ పెట్టి బాణంలా దూసుకుపోతున్నాడీ కుర్రాడు. అర్జునుడిలా విల్లు ఎక్కిపెట్టి లక్ష్య ఛేదనలో చక్కగా రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ పతకాలను సొంతం చేసుకుంటున్నాడు. గూడూరు పట్టణంలోని ధూర్జటినగర్ ప్రాంతానికి చెందిన కోదండపాణి, సత్య దంపతుల కుమారుడు తరునీష్ జత్యా. కోదండపాణి టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ కుమారుడ్ని ఏదో క్రీడలో గొప్పవాడిగా చూడాలని ఆశపడేవాడు. ఈ క్రమంలో గూడూరులో అర్జున్ ఆర్చరీ అకాడమీ ఏర్పాటైంది. విలువిద్యపై తరునీష్ ఆసక్తిని గమనించి 2018లో అందులో చేర్పించాడు. అప్పుడు 5వ తరగతి చదువుతున్న తరునీష్ కోచ్ శివశంకర్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ప్రావీణ్యత సాధించాడు. అంకుఠిత దీక్ష, ఏకాగ్రత ఉంటేనే నిలదొక్కుకునే ఈ క్రీడలో అంచెలంచెలుగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సైదాపురంలోని ఓ ప్రైవేటు జూనియర్ కలాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మరోపక్క అహ్మదాబాదులోని ఓ ఆర్చరీ అకాడమీలో నాలుగు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు.
7 జీడీఆర్ 1,: తరునీష్ జత్యా
విలువిద్యలో చక్కని ప్రతిభ
ఒలింపిక్ లక్ష్యంగా పరిశ్రమ
గూడూరు, ఆంధ్రజ్యోతి : ఇష్టపడిన రంగంలో కష్టపడితే ఫలితాలెలా ఉంటాయో నిరూపిస్తున్నాడు తరునీష్ జత్యా. తనకు నచ్చిన విలువిద్యపై ఫోకస్ పెట్టి బాణంలా దూసుకుపోతున్నాడీ కుర్రాడు. అర్జునుడిలా విల్లు ఎక్కిపెట్టి లక్ష్య ఛేదనలో చక్కగా రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతూ పతకాలను సొంతం చేసుకుంటున్నాడు.
గూడూరు పట్టణంలోని ధూర్జటినగర్ ప్రాంతానికి చెందిన కోదండపాణి, సత్య దంపతుల కుమారుడు తరునీష్ జత్యా. కోదండపాణి టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ కుమారుడ్ని ఏదో క్రీడలో గొప్పవాడిగా చూడాలని ఆశపడేవాడు. ఈ క్రమంలో గూడూరులో అర్జున్ ఆర్చరీ అకాడమీ ఏర్పాటైంది. విలువిద్యపై తరునీష్ ఆసక్తిని గమనించి 2018లో అందులో చేర్పించాడు. అప్పుడు 5వ తరగతి చదువుతున్న తరునీష్ కోచ్ శివశంకర్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ప్రావీణ్యత సాధించాడు. అంకుఠిత దీక్ష, ఏకాగ్రత ఉంటేనే నిలదొక్కుకునే ఈ క్రీడలో అంచెలంచెలుగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సైదాపురంలోని ఓ ప్రైవేటు జూనియర్ కలాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మరోపక్క అహ్మదాబాదులోని ఓ ఆర్చరీ అకాడమీలో నాలుగు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు.
పదో ఏట నుంచే పతకాలు
తరునీష్ చిన్నతనం నుంచే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ఆర్చరీ పోటీలలో ప్రతిభ చాటుతున్నాడు. గతేడాది నవంబరులో గుజరాత్‌లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో వ్యక్తిగత, ఓవరాల్ విభాగాలలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించాడు. స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ ఈ కుర్రాడి ప్రతిభకు ముచ్చటపడి రూ.50 వేలు నగదు ప్రోత్సాహక బహుమతితో సత్కరించారు. ఈ ఏడాది మేలో బీహర్ జరిగిన ఖేలో ఇండియా పోటీల్లోనూ మెరిసి కాంస్య పతకం దక్కించుకున్నాడు. 2022లో రాష్ట్రస్థాయి జూనియర్స్‌లో, గతేడాది రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. ఈయేడాది జనవరిలో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్ పోటీలలో మొదటి స్థానంలో నిలిచాడు.
ఒలింపిక్‌లో మెడల్ లక్ష్యం
ఆర్చరీ అంటే ప్రాణం. పదో ఏడాది నుంచి ఈక్రీడపైనే దృష్టి పెట్టాను. అమ్మానాన్నలూ ప్రోత్సాహమందిస్తున్నారు. మన దేశం తరపున ఒలింపిక్ పోటీలలో పాల్గొని పతకం సాధించడమే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకు పట్టుదలతో శ్రమిస్తున్నాను. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే నమ్మకముంది.
- తరునీష్ జత్యా