టైమ్స్ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూకు చోటు
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:25 AM
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఎస్వీ యూనివర్సిటీకి చోటు దక్కింది. ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్‌లో 601-800 మధ్య ర్యాంకు సాధించింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ఎస్వీ యూనివర్సిటీకి చోటు దక్కింది. ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్‌లో 601-800 మధ్య ర్యాంకు సాధించింది. తద్వారా యూనివర్సిటీ ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనల్లో ప్రపంచ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంది. మన దేశం నుంచి 88 విద్యా, పరిశోధన సంస్థలు ఈ పోటీలో పాల్గొనగా పరిశోధనల్లో నాణ్యత, ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు, పర్యావరణ సంబంధ కృషిలో ఎస్వీయూ ప్రత్యేకతను నిరూపించుకుంది. ఎస్వీయూకు ర్యాంకు దక్కడం పట్ల వీసీ నరసింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు హర్షం వ్యక్తం చేశారు.