అనుమానితులు కనిపిస్తే సమాచారమివ్వండి
ABN , Publish Date - May 17 , 2025 | 01:51 AM
తిరుమలలో ఎవరైనా అనుమానితంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని భద్రతాధికారులు స్థానిక మహిళలను కోరారు.
తిరుమలలో స్థానిక మహిళలకు భద్రతాధికారుల సూచన
తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఎవరైనా అనుమానితంగా కనిపిస్తే తమకు సమాచారమివ్వాలని భద్రతాధికారులు స్థానిక మహిళలను కోరారు. తిరుమలలో శుక్రవారం భద్రతా తనిఖీలు జరిగాయి. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో వన్, టూటౌన్ పోలీసులు, విజిలెన్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్, కంచి, పుష్పగిరి, ఉడిపి, కాశీ, శృంగేరి శంకర మఠాలు, గుబ్బా చౌల్ర్టీ, ఎస్వీ మ్యూజియం, ఆర్బీ సెంటర్, గోల్డెన్ బాలాజీ హోటల్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా తిరుమలలో నివాసముంటున్న స్థానిక మహిళలు, వృద్ధులతో మాట్లాడారు. మహిళలు శక్తి యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మీ రక్షణ పోలీసుల చేతుల్లో ఉంటుందని వివరించారు. పలు భవనాల్లో ఫైర్ సేఫ్టీ విధానాలను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ఫిన్స్ ద్వారా విచారించారు.