వరసిద్ధుడి ఆలయ చైర్మన్‌గా సురేంద్రబాబు
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:28 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆలయ చైర్మన్‌గా సురేంద్ర బాబు అలియాస్ మణి నాయుడు ఎంపికయ్యారు.ట్రస్టు బోర్డు సభ్యులు బుధవారం ఉదయం ఆలయ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశాక సురేంద్రబాబును చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఐరాల(కాణిపాకం), నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆలయ చైర్మన్‌గా సురేంద్ర బాబు అలియాస్ మణి నాయుడు ఎంపికయ్యారు.ట్రస్టు బోర్డు సభ్యులు బుధవారం ఉదయం ఆలయ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశాక సురేంద్రబాబును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. కర్నూలుకు చెందిన ట్రస్టు బోర్డు సభ్యురాలు రాజ్యలక్ష్మి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారు.బోర్డు సభ్యులైన సురేంద్ర బాబు, చంద్రశేఖర రెడ్డి, డాక్టర్ బీవీ.నరే్‌ష,పరిమి చంద్రకళ, కేఎ్‌స.అనసూయమ్మ, కత్తి సుధాకర రెడ్డి,సంధ్యారాణి దేవరకొండ, సునీత గుంటుపల్లె, కొత్తపల్లె శివప్రసాద్, నాగరాజు నాయుడు, శ్రీపతి సతీష్, పెరుమాళ్ల సుబ్బారెడ్డి,చల్లా కృష్ణవేణి,పి.పద్మలత, కనకరాజు,వసంత,శ్రీవాణి బుధవారం ఉదయం ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో పెంచలకిషోర్ సమక్షంలో ప్రమాణం చేశారు.చైర్మన్ మణినాయుడు మాట్లాడుతూ సభ్యులందరం సమష్టిగా ఆలయ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఆలయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తామన్నారు. అనంతరం బోర్డు సభ్యులంతా వినాయక స్వామిని దర్శించుకున్నారు.