Share News

28 నుంచి సుందరకాండ పారాయణం

ABN , Publish Date - Nov 24 , 2025 | 01:24 AM

లోకకల్యాణం కోసం ఈ నెల 28 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమలలోని వసంతమండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు.

28 నుంచి సుందరకాండ పారాయణం

తిరుమల, నవంబరు23(ఆంధ్రజ్యోతి): లోకకల్యాణం కోసం ఈ నెల 28 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు తిరుమలలోని వసంతమండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నారు. 27వ తేదీ సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో అంకురార్పణ చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వసంత మండపంలో సుందరకాండ పారాయణం, ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఆరాధన, అభిషేకం, హోమం, అనుష్టానం నిర్వహించనున్నారు. డిసెంబరు 13వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య వేదవిజ్ఞానపీఠంలో పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది.

Updated Date - Nov 24 , 2025 | 01:24 AM