ప్రతికూలతను ఎదుర్కొంటేనే విజయం
ABN , Publish Date - Nov 20 , 2025 | 02:08 AM
ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలడితేనే విజయం సొంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు.కుప్పం నియోజకవర్గ పర్యటనలో తొలి రోజైన బుధవారంనాడు ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కొద్దిసేపు విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అనంతరం వారినుంచి ప్రశ్నలను ఆహ్వానించారు. పలువురు విద్యార్థులు దీనిపై ఉత్సాహంగా స్పందించి, ఆమెపై ప్రశ్నలను సంధించారు. ప్రశ్నలన్నింటికీ భువనేశ్వరి ఓపిగ్గా, దీటుగా సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబులో మీకు నచ్చిన నాయకతవ్వ లక్షణం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, సమస్యను చక్కగా విశ్లేషించుకుని కార్యాచరణకు పూనుకునే లక్షణం తనకు ఎంతో ఇష్టమన్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని, సేవారంగమే సామాజిక రంగానికి బాటలు వేస్తుందని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఫలితం ఆశించకుండా సామాజిక సేవ చేయాలన్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సమయ పాలన వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. విద్యార్థులు మొదట చదువుపైన దృష్టిపెట్టి కర్తవ్యం నిర్వహించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఉద్బోధించారు. పురుషులలో లేని, సహజమైన సహనశక్తి స్త్రీలకు సహజంగానే సంక్రమిస్తుందన్న భువనేశ్వరి, అందువల్లనే స్త్రీలు అన్ని పనులనూ సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు మిన్నువిరిగి మీదపడ్డా చలించరని, ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన చూపించే చొరవ తనకు బాగా నచ్చిన లక్షణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, కడా పీడీ వికాస్ మర్మత్,పీకేఎం ఉడా చైర్మన్ సురేశ్‌బాబు, ద్రావిడ వర్శిటీ వీసీ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్, అకడమిక్ డీన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులతో ముఖాముఖిలో భువనేశ్వరి
కుప్పం/గుడుపల్లె, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలడితేనే విజయం సొంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విద్యార్థులకు సూచించారు.కుప్పం నియోజకవర్గ పర్యటనలో తొలి రోజైన బుధవారంనాడు ఆమె ద్రావిడ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కొద్దిసేపు విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అనంతరం వారినుంచి ప్రశ్నలను ఆహ్వానించారు. పలువురు విద్యార్థులు దీనిపై ఉత్సాహంగా స్పందించి, ఆమెపై ప్రశ్నలను సంధించారు. ప్రశ్నలన్నింటికీ భువనేశ్వరి ఓపిగ్గా, దీటుగా సమాధానం ఇచ్చారు. సీఎం చంద్రబాబులో మీకు నచ్చిన నాయకతవ్వ లక్షణం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, సమస్యను చక్కగా విశ్లేషించుకుని కార్యాచరణకు పూనుకునే లక్షణం తనకు ఎంతో ఇష్టమన్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని, సేవారంగమే సామాజిక రంగానికి బాటలు వేస్తుందని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఫలితం ఆశించకుండా సామాజిక సేవ చేయాలన్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సమయ పాలన వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంద న్నారు. విద్యార్థులు మొదట చదువుపైన దృష్టిపెట్టి కర్తవ్యం నిర్వహించాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఉద్బోధించారు. పురుషులలో లేని, సహజమైన సహనశక్తి స్త్రీలకు సహజంగానే సంక్రమిస్తుందన్న భువనేశ్వరి, అందువల్లనే స్త్రీలు అన్ని పనులనూ సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారని పేర్కొన్నారు. చంద్రబాబు మిన్నువిరిగి మీదపడ్డా చలించరని, ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయన చూపించే చొరవ తనకు బాగా నచ్చిన లక్షణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్.మునిరత్నం, కడా పీడీ వికాస్ మర్మత్,పీకేఎం ఉడా చైర్మన్ సురేశ్‌బాబు, ద్రావిడ వర్శిటీ వీసీ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్, అకడమిక్ డీన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.