Share News

పిడుగుపాటుకు విద్యార్థి మృతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:59 AM

పిడుగుపాటుకు ఓ విద్యార్థి మృతిచెందాడు. జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబునాయుడు కుమారుడు లతీష్‌కుమార్‌(20) చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్‌కుమార్‌పై పిడుగు పడి ంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

పిడుగుపాటుకు విద్యార్థి మృతి

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు ఓ విద్యార్థి మృతిచెందాడు. జంగాలపల్లి గ్రామానికి చెందిన చిట్టిబాబునాయుడు కుమారుడు లతీష్‌కుమార్‌(20) చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఇంటి మిద్దెపైకి వెళ్లిన లతీష్‌కుమార్‌పై పిడుగు పడి ంది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయమైనా లతీష్‌కుమార్‌ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు మిద్దెపై వెతికారు అక్కడ విగత జీవుడిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. తహసీల్దార్‌ జయప్రకాష్‌, పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు.

Updated Date - Oct 14 , 2025 | 02:00 AM