బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:44 AM
బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు.
పుంగనూరు రూరల్, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.....పుంగనూరు పట్టణం ఎన్‌ఎస్‌పేటలోని మురిగిమఠంవీధికి చెందిన సుబ్రహ్మణ్యంరాజు కుమారుడు సురేంద్రరాజు(22) తమిళనాడులో బీటెక్ చదువుతున్నాడు.సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడి దాదాపు రూ.30లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు మంగళవారం మందలించారు. దీంతో సురేంద్రరాజు ఇంటి నుంచి వెళ్లిపోయి వనమలదిన్నె మార్గంలోని పొలంలో పశువుల షెడ్ వద్ద పురుగులమందు తాగాడు. స్పృహ కోల్పోయిన ఇతడ్ని పరిసరాల్లోని రైతులు గుర్తించారు. కుటుంబసభ్యులకు తెలియజేశారు. వారు చేరుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చెన్నై సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.