‘పీజీఆర్‌ఎ్‌స’పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:13 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్లను రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి హెచ్చరించారు.
తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ అదేశం
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 26(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్లను రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ జయలక్ష్మి హెచ్చరించారు. 22ఏ, రీసర్వే, హౌసింగ్, జీవో నెంబరు 30 తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో గురువారం ఆమె కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌తో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. మండలస్థాయిలో పీజీఆర్‌ఎస్ అర్జీల స్వీకరణకు నోడల్ అధికారులను నియమించాలన్నారు. వచ్చిన అర్జీలపై వారంలోపు నివేదికలు ఇవ్వాలన్నారు. పీజీఆర్‌ఎ్‌సపై ప్రతి తహసీల్దారు అవగాహన పెంచుకోవాలన్నారు. మ్యుటేషన్లు, కులధ్రువీకరణ, చట్టపరమైన అంశాల్లో తప్పిదాలకు తావివ్వరాదన్నారు. వెబ్‌ల్యాండ్‌కు సంబంధించి ఏ ఎంట్రీ అయినా నమోదు చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో వీఆర్వో అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్లను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. చట్టంలో లేనివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టంచేశారు. హౌసింగ్ ఫర్‌ఆల్ అంశంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని తొలిదశలో కేటగిరి1లో వచ్చే దరఖాస్తుల్లో ప్రభుత్వ భూమి రెడీగా ఉన్నవిపేర్కొనాలన్నారు. దరఖాస్తులు ఎక్కువ వచ్చిన గ్రామాలకు వెళ్లి సబ్ కలెక్టర్, ఆర్డీవోలు పరిశీలించాలన్నారు. ఆ తరువాత ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆగస్టు 15లోపు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెగ్యులైజేషన్‌కు సంబంధించి ప్రతి తహసీల్దారు మంగళవారం నుంచి శుక్రవారం వరకు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలన్నారు. భూ ఆక్రమణలు, రెండు వర్గాల మధ్య తగాదాలు తదితర అంశాల్లో తహసీల్దార్లు తమకున్న అధికారులను వినియోగించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు, శాంతి భద్రతల పరిరక్షణలో మెజిస్టీరియల్ అధికారాలు ఉపయోగించాలన్నారు. ప్రజలతో మర్యాదగా నడుచుకున్నప్పుడే రెవెన్యూ శాఖకు మంచిపేరు వస్తుందన్నారు. ఈ సమీక్షల్లో డీఆర్వో నరసింహులు, గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనా, ఎస్‌డీసీ దేవేంద్రరెడ్డి, సుధారాణి, ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకా్‌షరెడ్డి, కిరణ్మయి, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు.