తోతాపురి తక్కువకు కొంటే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:57 AM
తోతాపురి మామిడి కాయల రైతులకు తక్కువ ధర చెల్లించే ర్యాంపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. పాకాల మండలం దామలచెరువు మ్యాంగోనగర్ పరిసరాల్లోని ర్యాంపులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ర్యాంపు నిర్వాహకులు కిలో రూ.3 చొప్పున కొంటున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతుల నుంచి ఫిర్యాదు తీసుకొని ర్యాంపు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సీఐ సుదర్శన ప్రసాద్‌ను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా ఓ రైతు నుంచి ఫిర్యాదు తీసుకొని ర్యాంపు వద్ద కొనుగోలు చేస్తున్న షోలాపూర్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ర్యాంపుల వద్ద కనీసం కిలో రూ.4కు తక్కువ కాకుండా కొనుగోలు చేయకుంటే ఆ ర్యాంపులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ర్యాంపు వద్ద వీఆర్వో, కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. జీఎ్‌సకేసీఎంఎన్ ర్యాంపు నిర్వాహకుడు ట్రేడర్లతో కలిసి సిండికేట్ అయి టన్ను తోతాపురి కాయలకు 25 కిలోల చొప్పున సూట్ రైతుల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. అదనంగా సూట్ తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మామిడికాయలు తోలిన రైతు భాస్కర్‌రెడ్డితో కలెక్టర్ ఫోనులో మాట్లాడగా, కిలో రూ.3కు జీఎ్‌సకేసీఎంఎన్ ర్యాంప్ యజమాని కొన్నారని చెప్పారు. దీంతో ఆ ర్యాంప్ యజమానిపై కలెక్టర్ కేసు నమోదు చేయించారు.
- ఇద్దరు ర్యాంపు యజమానులపై కేసు నమోదు చేయించిన కలెక్టర్
పాకాల, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడి కాయల రైతులకు తక్కువ ధర చెల్లించే ర్యాంపుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. పాకాల మండలం దామలచెరువు మ్యాంగోనగర్ పరిసరాల్లోని ర్యాంపులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ర్యాంపు నిర్వాహకులు కిలో రూ.3 చొప్పున కొంటున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రైతుల నుంచి ఫిర్యాదు తీసుకొని ర్యాంపు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సీఐ సుదర్శన ప్రసాద్‌ను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా ఓ రైతు నుంచి ఫిర్యాదు తీసుకొని ర్యాంపు వద్ద కొనుగోలు చేస్తున్న షోలాపూర్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ర్యాంపుల వద్ద కనీసం కిలో రూ.4కు తక్కువ కాకుండా కొనుగోలు చేయకుంటే ఆ ర్యాంపులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ర్యాంపు వద్ద వీఆర్వో, కానిస్టేబుళ్లు ఉంటారన్నారు. జీఎ్‌సకేసీఎంఎన్ ర్యాంపు నిర్వాహకుడు ట్రేడర్లతో కలిసి సిండికేట్ అయి టన్ను తోతాపురి కాయలకు 25 కిలోల చొప్పున సూట్ రైతుల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. అదనంగా సూట్ తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మామిడికాయలు తోలిన రైతు భాస్కర్‌రెడ్డితో కలెక్టర్ ఫోనులో మాట్లాడగా, కిలో రూ.3కు జీఎ్‌సకేసీఎంఎన్ ర్యాంప్ యజమాని కొన్నారని చెప్పారు. దీంతో ఆ ర్యాంప్ యజమానిపై కలెక్టర్ కేసు నమోదు చేయించారు. తోతాపురి రైతులకు ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబరు 0877 2236007కు ఫోనుచేసి చెప్పాలన్నారు. ఉప్పరపల్లె పంచాయతీ రామిరెడ్డిగారిఇండ్లు సమీపంలోని సుప్రీం క్వాలిటీ ఫుడ్స్ గుజ్జు పరిశ్రమను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా వచ్చిన రైతులకు టోకెన్లు జారీ చేసి కొనాలని సూచించారు. చివరి మామిడికాయ వరకు కొనేలా చర్యలు చేపడతామని, ప్రతి రైతుకు కిలోకు రూ.4 చొప్పున రాయితీ వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, తహసీల్దారు సంతో్‌షసాయి, ఉద్యానశాఖ అధికారిణి శైలజ తదితరులు పాల్గొన్నారు.