Share News

కొనుగోళ్లతో కిక్కిరిసిన దుకాణాలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:56 AM

దీపావళి పండుగ కొనుగోళ్లతో చిత్తూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ సందడిగా మారాయి. కొత్త బట్టలు, పూజా సామగ్రి , టపాకాయలు కొనుగోలు చేసే వారితో చర్చివీధి, బజారువీధి, డీఐరోడ్డు, ప్రకాశం హైరోడ్డు తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి.

కొనుగోళ్లతో కిక్కిరిసిన దుకాణాలు
టపాకాల దుకాణాలవద్ద దుకాణదారులు, కొనుగోలు దారుల సందడి

చిత్తూరు సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పండుగ కొనుగోళ్లతో చిత్తూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ సందడిగా మారాయి. కొత్త బట్టలు, పూజా సామగ్రి , టపాకాయలు కొనుగోలు చేసే వారితో చర్చివీధి, బజారువీధి, డీఐరోడ్డు, ప్రకాశం హైరోడ్డు తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి.కేదార గౌరీవ్రతం నోముల సామాగ్రి,పూలు, పండ్లు, టెంకాయల ధరలు బాగా పెరిగాయి.కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన టపాకాయల దుకాణాల వద్ద జనసందడి నెలకొంది. ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక సిబ్బంది టపాకాయల దుకాణాల వద్ద పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:56 AM