‘ముక్కంటి’ పాలకమండలికి రాష్ట్రస్థాయి ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:51 AM
శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటి వరకు చైర్మన్‌తో పాటు సభ్యులకూ స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించేవారు. కాగా, రాహుకేతు పూజలతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విదేశీ భక్తులూ తరచూ ఆలయానికి వచ్చి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకొంటున్నారు. ఈ క్రమంలో ఆలయానికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ 16మంది సభ్యులు, ఒక ప్రత్యేక ఆహ్వానితుడితో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల వివరాలు ఉన్నాయి.
వివిధ నియోజకవర్గాల నుంచి 16 మంది సభ్యుల నియామకం
శ్రీకాళహస్తి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించింది. ఇప్పటి వరకు చైర్మన్‌తో పాటు సభ్యులకూ స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించేవారు. కాగా, రాహుకేతు పూజలతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విదేశీ భక్తులూ తరచూ ఆలయానికి వచ్చి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకొంటున్నారు. ఈ క్రమంలో ఆలయానికి రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ 16మంది సభ్యులు, ఒక ప్రత్యేక ఆహ్వానితుడితో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల వివరాలు ఉన్నాయి.
పేరు అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ
-------------------------------------------------------------------------------
కొట్టే సాయి ప్రసాద్(చైర్మన్) శ్రీకాళహస్తి జనసేన
సభ్యులు
బీలా స్రవంతి యలమంచలి టీడీపీ
చిన్నపోల లక్ష్మీనారాయణ పుటపర్తి టీడీపీ
డి.లక్ష్మమ్మ శ్రీకాళహస్తి టీడీపీ
జి.గోపీనాథ్ శ్రీకాళహస్తి టీడీపీ
కె.కుసుమ కుమారి ఒంగోలు టీడీపీ
కొమ్మనబోయిన రజని చీరాల టీడీపీ
నాగరాజు కొప్పెర్ల చింతలపూడి(ఎస్సీ) టీడీపీ
పెనగలూరు హేమావతి కడప టీడీపీ
కొమ్మరి విజయమ్మ నెల్లూరు సిటీ టీడీపీ
రుద్రాక్షుల కౌసల్యమ్మ వెంకటగిరి టీడీపీ
దండి రాఘవయ్య శ్రీకాళహస్తి జనసేన
పగడాల మురళి తిరుపతి జనసేన
వి. గుర్రప్పశెట్టి శ్రీకాళహస్తి టీడీపీ
కోలా వైశాలి శ్రీకాళహస్తి బీజేపీ
ప్రకాశ్‌రెడ్డి తెలంగాణ తెలంగాణ
కల్లె సావిత్రి రాజంపేట టీడీపీ
ప్రత్యేక ఆహ్వానితులు
చగణం శైలజ శ్రీకాళహస్తి