Share News

ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టేట్‌ టీం పరిశీలన

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:51 AM

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు పరిస్థితులు, అందుతున్న సేవలు, ఉండాల్సిన వసతులు, పాటించాల్సిన పద్ధతులపై కామన్‌ రివ్యూ మిషన్‌ సెంట్రల్‌ టీం ఈనెల నాల్గవ తేదీనుంచి జిల్లాలో పర్యటించనుంది. దాంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితోపాటు స్టేట్‌ టీం కూడా అప్రమత్తం అయ్యారు.

  ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టేట్‌ టీం పరిశీలన
చిత్తూరు టెలిఫోన్‌ కాలనీలోని యూపీహెచ్‌సీ ఫార్మసీలో తనిఖీలు

చిత్తూరు రూరల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు పరిస్థితులు, అందుతున్న సేవలు, ఉండాల్సిన వసతులు, పాటించాల్సిన పద్ధతులపై కామన్‌ రివ్యూ మిషన్‌ సెంట్రల్‌ టీం ఈనెల నాల్గవ తేదీనుంచి జిల్లాలో పర్యటించనుంది. దాంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితోపాటు స్టేట్‌ టీం కూడా అప్రమత్తం అయ్యారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలిస్తున్నారు. అక్కడున్న వైద్యులు, సిబ్బందికి పలు సూచనలిస్తున్నారు. ప్రధానంగా ఆస్పత్రిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. మొత్తానికి సెంట్రల్‌ టీం రాకతో ప్రభుత్వ ఆస్పత్రులు బాగుపడనున్నాయి. మందులు, మాత్రలు, వ్యాక్సిన్లు, రికార్డులు అప్డేట్‌ అవుతున్నాయి. శనివారం నగరంలోని టెలిఫోన్‌ కాలనీలోని యూపీహెచ్‌సీని, కాణిపాకం పీహెచ్‌సీ, తుళ్లూరు, వసంతాపురం, జంగాలపల్లె హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను స్టేట్‌ టీం సభ్యులు సుబ్రహ్మణ్యం, నితీ్‌షరామ్‌ పరిశీలించారు. అలాగే కుప్పం పరిసర ఆస్పత్రులను డీఎంహెచ్‌వో సుధారాణి తనిఖీ చేసి.. సూచనలు ఇవ్వగా.. డీఐవో హనుమంతరావు పలమనేరు పరిసర పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. నగరి ఏరియా వైద్యశాలను ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ నవీన్‌ తేజ్‌ పరిశీలించారు.

Updated Date - Nov 02 , 2025 | 12:51 AM