స్టేట్ ఓపెన్ చెస్ టోర్నీ విజేత భవన్
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:25 AM
జిల్లా చెస్ అసోసియేషన్, యువన్య బ్రెయిన్ బాక్స్ చెస్ అకాడమీ సంయుక్త ఆఽధ్వర్యంలో చిత్తూరులోని అరణ్య సాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌కు 26 జిల్లాల నుంచి సుమారు 350 మంది పాల్గొన్నారు. ఓపెన్ కేటగిరీ కావడంతో నాలుగేళ్ల పిల్లాడి నుంచి 50 ఏళ్లు దాటినవారి వరకు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 350 మంది క్రీడాకారుల హాజరు
చిత్తూరు క్రీడలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా చెస్ అసోసియేషన్, యువన్య బ్రెయిన్ బాక్స్ చెస్ అకాడమీ సంయుక్త ఆఽధ్వర్యంలో చిత్తూరులోని అరణ్య సాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌కు 26 జిల్లాల నుంచి సుమారు 350 మంది పాల్గొన్నారు. ఓపెన్ కేటగిరీ కావడంతో నాలుగేళ్ల పిల్లాడి నుంచి 50 ఏళ్లు దాటినవారి వరకు హాజరయ్యారు. వివరాలను సోమవారం నిర్వాహకులు వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొల్లా భవన్ (ఎన్టీఆర్ జిల్లా), జేకే రాజు (ప్రకాశం జిల్లా), హర్షఫ్ సుభాని (తిరుపతి జిల్లా) నిలిచారు. వీరికి రూ.15వేలు, రూ.10వేలు, రూ.7500 అందజేశారు. అలాగే అన్ని విభాగాల్లో గెలుపొందిన, పాల్గొన్న క్రీడాకారులకు ఆంధ్రా చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్, జిల్లా చైర్మన్ బాబూప్రసాద్ రెడ్డి కలిసి జ్ఞాపిక, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తిరుపతికి చెందిన చైతన్య కన్‌స్ట్రక్షన్ చైర్మన్ వెంకటేష్, టోర్నమెంట్ డైరెక్టర్ యువన్య, జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి బాలు సోమనాథ్, సభ్యులు లేఖ్య, డీఎస్ పిళ్లై, దినేష్, సురేఖ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
43 ఏళ్ల వ్యక్తితో నాలుగేళ్ల పిల్లాడు పోటీ
చిత్తూరుకు చెందిన చైతన్య (4), సుధాకర్(43) మధ్య జరిగిన పోటీని పలువురు ఆసక్తిగా చూశారు. చైతన్య 7 పాయింట్లకు 3 పాయింట్లు సాధించగా, సుధాకర్ ఒక పాయింట్ తేడాతో గెలుపొందారు.