ఎలకా్ట్రనిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీలో శ్రీసిటీకి ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:10 AM
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న ఏపీ ఎలకా్ట్రనిక్స్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీలో శ్రీసిటీకి ప్రాధాన్యం లభించనుంది.
తిరుపతిలో మరో ఫైవ్ స్టార్ హోటల్‌కు అనుమతి
గ్రీన్‌ల్యామ్ పరిశ్రమ విస్తరణకు ప్రోత్సాహకాలు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
తిరుపతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న ఏపీ ఎలకా్ట్రనిక్స్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీలో శ్రీసిటీకి ప్రాధాన్యం లభించనుంది. అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో జిల్లాకు సంబంధించీ ఉన్నాయి. రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్స్ వస్తువుల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఏపీ ఎలకా్ట్రనిక్స్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 (2025-30)ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీలో భాగంగా శ్రీసిటీలో వ్యాపార వేగాన్ని పెంచడం, దేశంలోనూ, అలాగే ప్రపంచ స్థాయిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను, ఎలకా్ట్రనిక్స్ భాగాల పర్యావరణ వ్యవస్థను ఉత్తేజితం చేయనుంది. దీనివల్ల శ్రీసిటీలో పెట్టుబడి పెట్టే ఎలకా్ట్రనిక్ భాగాల తయారీ కంపెనీలు ముందస్తు ప్రోత్సాహకాలు, మ్యాచింగ్ ప్రోత్సాహకాలు, మధ్యంతర మద్దతు వంటివి ప్రభుత్వం నుంచీ పొందనున్నాయి. వీటన్నింటి వల్ల శ్రీసిటీలో ఎలకా్ట్రనిక్స్ విడి భాగాల తయారీ పరిశ్రమలు మరిన్ని ఏర్పాటై ఉద్యోగాల కల్పనకు గణనీయంగా అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఫ నాయుడుపేట పారిశ్రామికవాడలో ఇప్పటికే రూ.1150 కోట్ల పెట్టుబడితో 1800 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన మెస్సర్స్ గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ సంస్థ పరిశ్రమను విస్తరించే ప్రయత్నాల్లో వుంది. దీనికి కూడా ఈనెల 17న జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో చేసిన సిఫారసులను మంత్రివర్గం ఆమోదించింది.
ఫ ఇప్పటికే తిరుపతి, పరిసరాల్లో అనేక ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటవుతున్న నేపధ్యంలో తాజాగా మరో సంస్థకు మంత్రివర్గం అనుమతిచ్చింది. బెంగళూరుకు చెందిన మెస్సర్స్ స్టార్టర్న్ ఎల్‌ఎల్‌పీ సంస్థ తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు ముందుకు రాగా అవసరమైన భూమి, రాయితీలు ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది.