గురుకులాల్లో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:29 AM
జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు అర్బన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. రామకుప్పం బాలుర పాఠశాలలోని ఐదో తరగతిలో 41 సీట్లు, ఆరో తరగతిలో ఎనిమిది, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీలో 18, బైపీపీలో తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. విజలాపురం బాలుర గురుకుల విద్యాలయంలో ఐదో తరగతిలో 35 సీట్లు, ఆరో తరగతిలో ఒకటి, ఎనిమిదో తరగతిలో రెండు, చిత్తూరులో బాలికలకు ఐదో తరగతిలో 27 సీట్లు, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీలో ఐదు, బైపీసీలో ఒకటి, పలమనేరులో ఐదో తరగతిలో ఆరు, ఎనిమిదో తరగతిలో ఒకటి, ఎంఈసీలో 30, సీఈసీలో నాలుగు, కుప్పంలో బాలికలకు ఐదో తరగతిలో 41, ఏడో తరగతిలో ఒకటి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీలో తొమ్మిది, బైపీసీలో ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి కలిగిన బాల, బాలికలు ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సీట్లను పొందాలని కోరారు.