Share News

డీఎస్సీలో క్రీడా కోటా 41 పోస్టులు

ABN , Publish Date - May 04 , 2025 | 02:20 AM

విధ స్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది.

డీఎస్సీలో క్రీడా కోటా 41 పోస్టులు

తిరుపతి(క్రీడలు), మే 3(ఆంధ్రజ్యోతి): ‘వివిధ స్థాయిల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది. ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో క్రీడాకోటా కింద జిల్లాలో 41 పోస్టులు కేటాయించడం ఇందుకు నిదర్శనం’ అని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు అన్నారు. తద్వారా క్రీడాకారుల 35ఏళ్ల కల సాకారమైందన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను శాప్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలి ప్రతిపాదనగా దీనిని సీఎం చంద్రబాబు ముందుంచగా, ఆయన అంగీకరించారన్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో స్పోర్ట్స్‌ కోటా కింది 3శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

Updated Date - May 04 , 2025 | 02:20 AM