తమిళనాడులోని దోపిడీ కేసులో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:54 AM
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త భార్యను కొట్టి దోపిడీకి పాల్పడిన కేసులో ఇతడితో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు.
తిరుమల/చెన్నై, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త భార్యను కొట్టి దోపిడీకి పాల్పడిన కేసులో ఇతడితో పాటు మరో ముగ్గురు అరెస్టయ్యారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి నీలికొల్లై వీధికి తోళ్లపరిశ్రమ యజమాని ఇంతియాస్ అహ్మద్ ఇంట్లో శక్తివేల్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట నలుగురు ఆ ఇంట్లో చొరబడి వ్యాపారవేత్త భార్య సబితా గుల్షుంను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా వాణియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు, శక్తివేల్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇళవరసన్(49) సహా నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌కు.. ఇళవరసన్‌కు పరిచయం ఉండగా.. ఇళవరసన్‌క తిరుపతికి చెందిన శాంతకుమారి బాగా తెలుసు. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సాయం కోరారు. అతడి ప్లాన్ ప్రకారం ఆ ముగ్గురు దోపిడీకి పాల్పడ్డారు. దీంతో కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌ను తిరుపతి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని వాణియంబాడికి తరలించారు. కాగా, కడపజిల్లాకు చెందిన అరుణ్‌కుమార్ రెండేళ్లుగా అలిపిరి చెక్‌పాయింట్, తిరుమలలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అలిపిరి నుంచి తిరుమలలో బ్యాగేజీ స్కానింగ్ సెంటర్‌కు మారాడు. ఈఅంశంపై స్థానిక ఎస్పీఎఫ్ అధికారి మాట్లాడేందుకు నిరాకరించారు.