నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:23 AM
తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని ఇండియన్ రైల్వే కోచింగ్ విభాగం ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్‌కుమార్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
తిరుపతి(సెంట్రల్), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని ఇండియన్ రైల్వే కోచింగ్ విభాగం ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవీన్‌కుమార్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. టెండర్ ఒప్పందం మేరకు నిర్ణయించిన గడువు లోపు పనులు ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అంతకు ముందు ఆధునిక స్టేషన్ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూశారు. ఈ కార్యక్రమంలో జోనల్ చీఫ్ ఇంజనీర్ కె.సూర్యనారాయణ, నిర్మాణాల విభాగం అధికారులు శ్రీనిభాష్, జి.వామనమూర్తి, సీనియర్ డీవోఎం శ్రావణకుమార్, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఎస్‌ఎంఆర్ డాక్టర్ కె.చిన్నపరెడ్డి, దరూరు ప్రభాకర్, మాధవరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.