సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:12 AM
లో ఓల్టేజ్.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’ అని సదరన్ డిసం్క సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలోని సదరన్ డిస్కం కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్కం పరిధిలోని 65 మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో సిబ్బంది నిర్లక్ష్యం జరుగుతోందని, అనతికాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చే చిన్న సమస్యలతో పాటు పెద్దవీ త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని చెప్పారు.
సదరన్ డిస్కం సీఎండీ శివశంకర్
తిరుపతి(ఆటోనగర్), నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘లో ఓల్టేజ్.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయని వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’ అని సదరన్ డిసం్క సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలోని సదరన్ డిస్కం కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్కం పరిధిలోని 65 మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో సిబ్బంది నిర్లక్ష్యం జరుగుతోందని, అనతికాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చే చిన్న సమస్యలతో పాటు పెద్దవీ త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని చెప్పారు. సీజీఎంలు, జీఎంలు నోడల్ అధికారులుగా వ్వవహరిస్తారని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తెస్తే, తగిన ప్రాధాన్యమిచ్చి, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పపటి వరకు వచ్చిన సమస్యల్లో, సాంకేతిక పరమైన సమస్యలు మినహా మిగిలినవి పరిష్కరించామన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎండీ హెచ్చరించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్లు 1912, 1800 425155333 కి డయల్ చేసి... 91333 31912 నెంబరుకు చాట్ చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె. గురవయ్య, పి.అయూబ్‌ఖాన్, కె.రామమోహనరావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, పి.హెచ్.జానకిరామ్, ఎం.మురళీకుమార్, పి.సురేంద్ర నాయుడు, కె.ఆదిశేషయ్య, ఎం.ఉమాపతి, జీఎంలు ఎం.కృష్ణారెడ్డి, రామచంద్ర రావు, జి.చక్రపాణి, డి.సురేంద్రరావు, పి.భాస్కర్‌రెడ్డి, విజయన్, జగదీష్ పాల్గొన్నారు.
ౖనట్లు తెలిపారు. ట్రాక్టరు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది.