ప్రత్యేక సహస్ర కలశాభిషేకం
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:25 AM
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, భోగశ్రీనివాసమూర్తి, విష్వక్సేనుడిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తి ముందున్న గరుడాళ్వార్ సన్నిధిలో భోగ శ్రీనివాసమూర్తిని, ఆయనకు అభిముఖంగా విష్వక్సేనుడిని ఆశీనులు చేశారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని భోగశ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. భోగశ్రీనివాసమూర్తికి నిర్వహించే భిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. అనంతరం వేదపండితులు వేద పారాయణం చేయగా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం నిర్వహించారు. కాగా, పల్లవరాణి సామవై పెరుందేవి క్రీ.శ 614లో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవు కలిగిన వెండి భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని శ్రీవారి ఆలయానికి కానుకగా ఇచ్చారు. విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింద భాగంలోని గోడపై ఈ శాసనం కనిపిస్తుంది. ఈ కలశాభిషేకంలో జీయర్ స్వాములు, చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి