Share News

యోగాంధ్రకు విశేష స్పందన

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:39 AM

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లాలో విజయవంతమైంది.9.65 లక్షలమంది తమ పేర్లను నమోదు చేసుకోగా శనివారం జిల్లాలోని 5508 ప్రాంతాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో 8.11 లక్షల మంది పాల్గొన్నారు.

యోగాంధ్రకు విశేష స్పందన
యోగాసనాలు వేస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ, మేయర్‌ , చుడా చైర్‌పర్సన్‌ తదితరులు

జిల్లావ్యాప్తంగా 8.11 లక్షలమంది హాజరు

చిత్తూరులో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, ఎస్పీ, డీఎ్‌ఫవో

చిత్తూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం శనివారం జిల్లాలో విజయవంతమైంది.9.65 లక్షలమంది తమ పేర్లను నమోదు చేసుకోగా శనివారం జిల్లాలోని 5508 ప్రాంతాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో 8.11 లక్షల మంది పాల్గొన్నారు. సుమారు 5 వేలమంది యోగా ట్రైనర్లు హాజరై ఆసనాలు వేయించారు.చిత్తూరులోని మెసానికల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో 5400మంది ప్రజలు పాల్గొన్నారు.కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ విద్యాధరి, ఎస్పీ మణికంఠ, డీఎ్‌ఫవో భరణి, చుడా ఛైర్‌పర్సన్‌ హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. బంగారుపాళ్యం ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మురళీమోహన్‌, రొంపిచెర్లలో టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, కుప్పంలో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, కడా పీడీ వికాస్‌, వి.కోటలో జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు హాజరయ్యారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సురేంద్రకుమార్‌, కార్జాల అరుణ తదితరులు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, సచివాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అన్నిచోట్లా పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల్ని నియమించారు. మే 21 నుంచి జిల్లాలో ప్రారంభమైన యోగాంధ్ర కార్యక్రమం నెల రోజుల పాటు విజయవంతంగా నడిచింది.పులిగుండు, బోయకొండ, కంగుంది, కాణిపాకం వంటి ప్రాంతాల్లో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. పులిగుండు వద్ద నిర్వహించిన కార్యక్రమాన్ని పీఎం మోదీ కూడా అభినందించిన విషయం తెలిసిందే.

దేవదాయశాఖ అనాసక్తి

చిత్తూరు కల్చరల్‌, జూన్‌21(ఆంధ్రజ్యోతి):యోగా దినోత్సవాల్లో జిల్లా దేవదాయశాఖ పాలుపంచుకోలేదు. చిత్తూరు నగరంలోనే దాదాపు వందకు పైగా ఆలయాలుండగా ఆరుగురు ఈవోలు,వెయ్యిమందికి పైగా సిబ్బంది ఉన్నారు.అర్చక, పురోహిత సంఘం ప్రతినిధుల ందరూ దేవదాయ శాఖ పరిధిలోకి వస్తారు. యోగా దినోత్సవంలో వీరెవరూ పాల్గొనకపోవడం విశేషం.

Updated Date - Jun 22 , 2025 | 01:39 AM