8, 9 తేదీల్లో తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:21 AM
పౌర్ణమి సందర్భంగా ఈనెల 8, 9 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశామని తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్ ఏటీఎం భాస్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి(ఆర్టీసీ), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పౌర్ణమి సందర్భంగా ఈనెల 8, 9 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశామని తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్ ఏటీఎం భాస్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8న ఉదయం 4గంటల నుంచి 9న ఉదయం 11గంటల వరకు ప్రతి 15నిమిషాలకు ఓ బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలోనూ 9వ తేది సాయంత్రం 5గంటల వరకు బస్సు సౌకర్యం కలదన్నారు.