మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:06 AM
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడతాయని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అన్నారు. శనివారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతరిక్ష నడక (స్పేస్ వాక్) కార్యక్రమాన్ని సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
- స్పేస్ వాక్ ప్రారంభోత్సవంలో షార్ డైరెక్టర్ పద్మకుమార్
సూళ్లూరుపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడతాయని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అన్నారు. శనివారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ ఆధ్వర్యంలో నిర్వహించే అంతరిక్ష నడక (స్పేస్ వాక్) కార్యక్రమాన్ని సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి షార్ ఉద్యోగుల కాలనీ స్వర్ణముఖినగర్ డీవోఎస్ కాలనీ వరకు స్పేస్ వాక్ నిర్వహించారు. ఇస్రో ప్రయోగించే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలను ఊరేగించారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రాముఖ్యత గురించి షార్ డైరెక్టర్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోల్ ముత్తు చెరియన్, కంట్రోలర్ రమేష్ బాబు, ఎంఎస్‌ఏ డీడీ గోపీకృష్ణ పాల్గొన్నారు.