ట్రాఫిక్ విధుల్లో ఎస్పీ
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:30 AM
ఎస్పీ మణికంఠ సోమవారం కుప్పం ట్రాఫిక్ విధుల్లో కనిపించారు. ట్రాఫిక్ పోలీస్ ద్విచక్ర వాహనం అధిరోహించి పట్టణంలో తిరుగుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రద్దీ ప్రదేశాలలో ఆగి, వాహనదారులకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగించారు. ఎక్కడైనా మహిళలపట్ల నేరాలు జరుగుతుంటే త్వరితగతిన పోలీసులు హాజరు కావడానికి 112, 100 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నెంబర్లు పోలీసులు అందుబాటులోకి రావడానికి సులభతరంగా ఉంటుందని చెప్పారు.
కుప్పం, జూన్ 30 (ఆంరఽధజ్యోతి): ఎస్పీ మణికంఠ సోమవారం కుప్పం ట్రాఫిక్ విధుల్లో కనిపించారు. ట్రాఫిక్ పోలీస్ ద్విచక్ర వాహనం అధిరోహించి పట్టణంలో తిరుగుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రద్దీ ప్రదేశాలలో ఆగి, వాహనదారులకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగించారు. ఎక్కడైనా మహిళలపట్ల నేరాలు జరుగుతుంటే త్వరితగతిన పోలీసులు హాజరు కావడానికి 112, 100 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నెంబర్లు పోలీసులు అందుబాటులోకి రావడానికి సులభతరంగా ఉంటుందని చెప్పారు.