Share News

నౌకా నిర్మాణ కేంద్రానికి స్థల పరిశీలన

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:48 AM

వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి అవసరమైన భూములను సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీన ఆధ్వర్యంలో కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది.

నౌకా నిర్మాణ కేంద్రానికి స్థల పరిశీలన
తూపిలిపాళెం సముద్రతీరంలో మ్యాప్‌ను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్రమీన, కేంద్ర బృందం

వాకాడు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న నౌకా నిర్మాణ కేంద్రానికి అవసరమైన భూములను సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీన ఆధ్వర్యంలో కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది. నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్న భూముల మ్యాప్‌ను పరిశీలించారు. పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఇక్బాల్‌ సయ్యద్‌, డిప్యూటీ తహసీల్దారు రఫీ సయ్యద్‌, రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 01:48 AM