తిరుపతికి చేరుకున్న సిట్ బృందం
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:20 AM
తిరుమల పరకామణి కేసు వారం రోజుల విరామం అనంతరం సోమవారం నుంచి పునఃవిచారణ ప్రారంభం కానుంది. సీఐడీ సిట్ బృందం ఆదివారం తిరుపతికి చేరుకుంది.
- నేటి నుంచి పరకామణి కేసు పునఃవిచారణ
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 23(ఆంధ్రజ్యోతి) : తిరుమల పరకామణి కేసు వారం రోజుల విరామం అనంతరం సోమవారం నుంచి పునఃవిచారణ ప్రారంభం కానుంది. సీఐడీ సిట్ బృందం ఆదివారం తిరుపతికి చేరుకుంది. పద్మావతి అతిథిగృహంలో పరకామణి చోరీ కేసులో తదనంతర పరిణామాలపై విచారణ మొదలుకానుంది. నిందితుడు రవికుమార్‌తో పనిచేసిన సిబ్బందితోపాటు కొంతమంది టీటీడీ పెద్దలను విచారించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎవరు అదేశించారు? అనే విచారణ కీలకంగా మారనుంది.