Share News

చిత్తూరులో సిట్‌ అలజడి

ABN , Publish Date - Sep 04 , 2025 | 02:00 AM

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ‘సిట్‌’ దర్యాప్తు చిత్తూరుకు చేరింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి జైల్లో వున్న విషయం తెలిసిందే. ఇటీవల మాజీ మంత్రి నారాయణస్వామిని కూడా పుత్తూరులోని ఆయన నివాసంలో రోజంతా విచారించారు.తాజాగా, చిత్తూరు వైసీపీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు సిట్‌ నోటీసులు ఇవ్వగా, రెండు రోజుల కిందట విజయవాడకు వెళ్లి విచారణకు హాజరై వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరం బీవీరెడ్డి కాలనీలోని నలందా నగర్‌లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్‌మెంటుకు సిట్‌ అధికారుల బృందం చేరుకుంది. అపార్ట్‌మెంటులోని రెండవ అంతస్థులో ఉన్న ‘వెల్‌టాస్క్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కార్యాలయంలో సిట్‌ ఏఎస్పీ కులశేఖర్‌ ఆధ్వర్యంలో సుమారు 9 మంది అధికారులు తనిఖీ చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా తనిఖీలు నిర్వహించారు.గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా లిక్కర్‌ సరఫరా చేసే టెండర్‌ను విజయానందరెడ్డి దక్కించుకున్నారనే సమాచారంతో సిట్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆ కార్యాలయంలోనే ఉన్న మరో విభాగంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన కార్యాలయం ‘సీఎంఆర్‌’ కూడా ఉంది. ఈ రెండు కార్యాలయాల్లోని పలు రికార్డులను సిట్‌ అధికారులు రాత్రి 8 గంటలకు వరకు తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. సిట్‌ అధికారులు తనిఖీ చేస్తున్నంతసేపు స్థానిక పోలీసులు లోపలికి ఎవరూ వెళ్లకుండా చూసుకున్నారు.సిట్‌ తనిఖీల విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, విజయానందరెడ్డి ఆరోగ్యం బాలేదని చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

చిత్తూరులో సిట్‌ అలజడి
విజయానందరెడ్డి కార్యాలయం నుంచి రికార్డుల్ని తీసుకెళ్తున్న సిట్‌ అధికారులు

  • విజయానందరెడ్డి, మోహిత్‌రెడ్డి

కార్యాలయాల్లో సోదాలు

చిత్తూరు అర్బన్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ కేసులో ‘సిట్‌’ దర్యాప్తు చిత్తూరుకు చేరింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి జైల్లో వున్న విషయం తెలిసిందే. ఇటీవల మాజీ మంత్రి నారాయణస్వామిని కూడా పుత్తూరులోని ఆయన నివాసంలో రోజంతా విచారించారు.తాజాగా, చిత్తూరు వైసీపీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు సిట్‌ నోటీసులు ఇవ్వగా, రెండు రోజుల కిందట విజయవాడకు వెళ్లి విచారణకు హాజరై వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరం బీవీరెడ్డి కాలనీలోని నలందా నగర్‌లో ఉన్న విజయానందరెడ్డి అపార్ట్‌మెంటుకు సిట్‌ అధికారుల బృందం చేరుకుంది. అపార్ట్‌మెంటులోని రెండవ అంతస్థులో ఉన్న ‘వెల్‌టాస్క్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కార్యాలయంలో సిట్‌ ఏఎస్పీ కులశేఖర్‌ ఆధ్వర్యంలో సుమారు 9 మంది అధికారులు తనిఖీ చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా తనిఖీలు నిర్వహించారు.గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా లిక్కర్‌ సరఫరా చేసే టెండర్‌ను విజయానందరెడ్డి దక్కించుకున్నారనే సమాచారంతో సిట్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆ కార్యాలయంలోనే ఉన్న మరో విభాగంలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన కార్యాలయం ‘సీఎంఆర్‌’ కూడా ఉంది. ఈ రెండు కార్యాలయాల్లోని పలు రికార్డులను సిట్‌ అధికారులు రాత్రి 8 గంటలకు వరకు తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లారు. సిట్‌ అధికారులు తనిఖీ చేస్తున్నంతసేపు స్థానిక పోలీసులు లోపలికి ఎవరూ వెళ్లకుండా చూసుకున్నారు.సిట్‌ తనిఖీల విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, విజయానందరెడ్డి ఆరోగ్యం బాలేదని చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

Updated Date - Sep 04 , 2025 | 02:00 AM