సార్.. ఇవిగో పరకామణి అక్రమాలు
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:53 AM
వైసీపీ హయాంలో శ్రీవారి కానుకల లెక్కింపు పరకామణిలో చోటుచేసుకున్న అక్రమాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి వివరించారు.
సీఎంకు నివేదిక అందించి.. వివరించిన భానుప్రకాష్
తిరుమల/తిరుపతి(విద్య), సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో శ్రీవారి కానుకల లెక్కింపు పరకామణిలో చోటుచేసుకున్న అక్రమాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి వివరించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను తిరుమలలో గురువారం అందజేశారు. సాక్ష్యాధారాల సహా తాను ఈ నివేదికను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నివేదికను పరిశీలించిన సీఎం.. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.