Share News

ఇన్‌చార్జి ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీసు

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:45 AM

రేణిగుంట ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభురావుకు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. మండలంలోని గుత్తివారిపల్లిలో తాగునీరు కాలుష్యం కావడంతో అతిసారం బారిన పడి ఓ వృద్ధురాలు మృతిచెందగా మరికొందరు ఆస్పత్రిపాలయ్యారు.

ఇన్‌చార్జి ఎంపీడీవోకు షోకాజ్‌ నోటీసు

రేణిగుంట సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): రేణిగుంట ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రభురావుకు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. మండలంలోని గుత్తివారిపల్లిలో తాగునీరు కాలుష్యం కావడంతో అతిసారం బారిన పడి ఓ వృద్ధురాలు మృతిచెందగా మరికొందరు ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో నీటి కలుషితం, పారిశుధ్యలోపం, ఇతర సర్వే నివేదికలు ఇప్పటివరకు అందజేయకపోవడంతో వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా జవాబు ఇవ్వాలని డీపీవో నోటీసులు జారీ చేశారు.

Updated Date - Sep 05 , 2025 | 01:45 AM