Share News

స్వర్ణ నెమలిపై శివపుత్రుడు

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:09 AM

కాణిపాక ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహనంపై దర్శన మిచ్చారు.కాణిపాకం, చినకాంపల్లె, కొత్తపల్లె,చిగరపల్లె, అగరంపల్లె, వడ్రాంపల్లె, దామరగుంట, కురప్పల్లె గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

స్వర్ణ నెమలిపై శివపుత్రుడు

ఐరాల(కాణిపాకం),ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కాణిపాక ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహనంపై దర్శన మిచ్చారు.కాణిపాకం, చినకాంపల్లె, కొత్తపల్లె,చిగరపల్లె, అగరంపల్లె, వడ్రాంపల్లె, దామరగుంట, కురప్పల్లె గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామికి ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం చేశాక సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను నెమలి వాహనంపై ఉంచి భాజా,భజంత్రీలు వాయిస్తూ కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు.రాత్రి ఉభయదారులు గంగుండ్ర మండపం వద్ద నుంచి ఉభయ వరసను తీసుకురాగా అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను స్వర్ణ నెమలి వాహనంపై కూర్చోబెట్టి పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఈవో పెంచల కిషోర్‌, ఏఈవో రవీంద్రబాబు,సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మూషిక వాహన సేవను నిర్వహించనున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 01:09 AM