Share News

డిసెంబరులో రెండు ప్రయోగాలకు షార్‌ సన్నద్ధం

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:43 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబరులో సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి రెండు ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. డిసెంబరు తొలివారంలో శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ద్వారా అమెరికన్‌ కమ్యూనికేషన్‌ బ్లూబర్డ్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టనుంది. చివరివారంలో పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ రాకెట్‌కు వినియోగించే పరికరాలు ఆదివారం కేరళలోని తిరువనంతపురం వీఎ్‌సఎ్‌ససీ సెంటర్‌ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ షార్‌కు చేరాయి. రెండో వాహక అనుసంధాన భవనం (వ్యాబ్‌)లో ఎల్వీఎం3-ఎ6 రాకెట్‌ అను సంధాన పనులు జరుగుతున్నాయి. మొదటి ప్రయోగ వేదిక వద్ద పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగ పనులు కూడా జరుగుతున్నాయి. రెండు ప్రయోగాలనంతరం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రైవేట్‌ వారి భాగస్వామ్యంతో పీఎ్‌సఎల్వీ-ఎల్‌ 1 రాకెట్‌ ప్రయోగించనున్నారు. రాకెట్ల తయారీ ఒప్పందం కింద ప్రైవేట్‌ రంగంవారు తయారీ చేసిన తొలి పీఎ్‌సఎల్వీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది.

డిసెంబరులో రెండు ప్రయోగాలకు  షార్‌ సన్నద్ధం

సూళ్లూరుపేట,నవంబరు9(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబరులో సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి రెండు ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. డిసెంబరు తొలివారంలో శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్‌ ద్వారా అమెరికన్‌ కమ్యూనికేషన్‌ బ్లూబర్డ్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టనుంది. చివరివారంలో పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ రాకెట్‌కు వినియోగించే పరికరాలు ఆదివారం కేరళలోని తిరువనంతపురం వీఎ్‌సఎ్‌ససీ సెంటర్‌ నుంచి ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ షార్‌కు చేరాయి. రెండో వాహక అనుసంధాన భవనం (వ్యాబ్‌)లో ఎల్వీఎం3-ఎ6 రాకెట్‌ అను సంధాన పనులు జరుగుతున్నాయి. మొదటి ప్రయోగ వేదిక వద్ద పీఎ్‌సఎల్వీ-సీ62 రాకెట్‌ ప్రయోగ పనులు కూడా జరుగుతున్నాయి. రెండు ప్రయోగాలనంతరం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రైవేట్‌ వారి భాగస్వామ్యంతో పీఎ్‌సఎల్వీ-ఎల్‌ 1 రాకెట్‌ ప్రయోగించనున్నారు. రాకెట్ల తయారీ ఒప్పందం కింద ప్రైవేట్‌ రంగంవారు తయారీ చేసిన తొలి పీఎ్‌సఎల్వీ రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది.

Updated Date - Nov 10 , 2025 | 01:43 AM