షార్‌తో విడదీయని బంధం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:18 AM
ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌కు షార్‌తో విడదీ యని బంధం ఉంది.
సూళ్లూరుపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌కు షార్‌తో విడదీ యని బంధం ఉంది. బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. 1990-94 బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేసిన కస్తూరి రంగన్.. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలోనే తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్టాయి. ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఈయన పీఎ్‌సఎల్వీ, జీఎ్‌సఎల్వీ రాకెట్ అభివృద్ధి కీలకపాత్ర పోషించారు. ఈయన హయాంలో షార్ నుంచి మొత్తం 8 ప్రయోగాలు చేపట్టారు. ఇందులో 6 పీఎ్‌సఎల్వీ, 2 జీఎ్‌సఎల్వీ ప్రయోగాలు ఉన్నాయి. కొత్తతరం అంతరిక్ష నౌక, ఇండియన్ నేషనల్ శాటిలైట్ అభివృద్ధికి (ఇన్‌శాట్-2), భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఐఆర్‌ఎ్‌స-1ఏ, 1బి వంటి కీలక ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. భూపరిశీలనకు సంబంధించిన భాస్కర-1, భాస్కర-2 ఉపగ్రహాలకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా, షార్‌లోని పరిపాలన విభాగ భవనంలో కస్తూరి రంగన్ చిత్రపటం ఏర్పాటు చేసి షార్ కంట్రోల్ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనకు షార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.