‘అక్షర ఆంధ్ర’ అమలుకు పలు కమిటీలు ఏర్పాటు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:00 AM
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అక్షర ఆంధ్ర పేరిట ఉల్లాస్ పథకం అమలు, స్వచ్ఛంద ఉపాధ్యాయుల నియామకం, తరగతుల నిర్వహణకు సంబంధించి జిల్లా, మండల, పట్టణస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అక్షర ఆంధ్ర పేరిట ఉల్లాస్ పథకం అమలు, స్వచ్ఛంద ఉపాధ్యాయుల నియామకం, తరగతుల నిర్వహణకు సంబంధించి జిల్లా, మండల, పట్టణస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాస్థాయి కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా జడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ, మెప్మా పీడీ, మహిళా, శిశు సంక్షేమశాఖ పీడీ, డీపీవో, డీఈవో, డీపీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారులు ఉంటారు. కోఆర్డినేటర్‌గా వయోజన విద్యాశాఖ అధికారి ఉంటారు. మండలస్థాయి కమిటీ చైర్మన్‌గా ఎంపీడీవో, సభ్యులుగా డీఆర్డీఏ ఏపీడీ, మహిళా, శిశు సంక్షేమశాఖ సీడీపీవో, ఎంఈవోలు ఉంటారు. కోఆర్డినేటర్‌గా వయోజనవిద్య శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి వ్యవహరిస్తారు. పట్టణస్థాయి కమిటీకి ఆయా మున్సిపల్ కమిషనర్లు చైర్మన్‌గా, కోఆర్డినేటర్లుగా సిటీమిషన్ మేనేజర్, సీడీపీవో, ఎంఈవో, వయోజన విద్యశాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.