‘పరకామణి’ పిటిషనర్‌కు భద్రతా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:18 AM
టీటీడీ పరకామణి చోరీ కేసులో పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఆ మేరకు చర్యలు చేపట్టింది.
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 22(ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి చోరీ కేసులో పిటిషనర్ మాచర్ల శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఆ మేరకు చర్యలు చేపట్టింది. అలిపిరి సీఐ రాంకిషోర్ శనివారం శ్రీనివాసులు ఇంటిని పరిశీలించారు. అతడి ఇంట్లోని సీసీ కెమెరాలను పోలీసుస్టేషన్‌కు అనుసంధానం చేశారు. వన్‌ప్ల్‌స వన్ పద్ధతిలో గన్‌మెన్లను కేటాయించారు. ఇంటి వద్ద 24 గంటలు పోలీసు నిఘా ఉంటుందని సీఐ వివరించారు.