Share News

మెగా పీటీఎంకు పాఠశాలలు సిద్ధం

ABN , Publish Date - Jul 10 , 2025 | 02:05 AM

జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహణకు సర్వం సిద్ధమైంది.జిల్లాలోని 2984 ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో పీటీఎం నిర్వహించనున్నారు.2,60,641 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సుమారు 1.65 లక్షల మంది కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.పచ్చటి తోరణాలతో, రంగవల్లులతో టీచర్లు, విద్యార్థులు పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌, జేసీ, డీఈవో, డీవైఈవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, స్పెషల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు శాఖల నుంచి ఒక్కో అధికారి ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంది.

మెగా పీటీఎంకు పాఠశాలలు సిద్ధం
కార్వేటినగరం మండలం డీఎంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీటీఎం రిహార్సల్‌

  • ప్రత్యేక అతిథులుగా ప్రజాప్రతినిధులు

  • పాఠశాలకో ప్రత్యేక అధికారి నియామకం

  • విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలపై సమీక్ష

  • తల్లిదండ్రులకు ఆటల పోటీలు

చిత్తూరు సెంట్రల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో గురువారం నిర్వహించే మెగా పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం) నిర్వహణకు సర్వం సిద్ధమైంది.జిల్లాలోని 2984 ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో పీటీఎం నిర్వహించనున్నారు.2,60,641 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సుమారు 1.65 లక్షల మంది కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.పచ్చటి తోరణాలతో, రంగవల్లులతో టీచర్లు, విద్యార్థులు పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌, జేసీ, డీఈవో, డీవైఈవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, స్పెషల్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు శాఖల నుంచి ఒక్కో అధికారి ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంది.

తల్లిదండ్రులకు స్వాగత ఏర్పాట్లు

పీటీఎంకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ముఖద్వారంలో స్వాగతం పలికేందుకు టీచర్లు, విద్యార్థులతో కలిపి కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల వరకు సమాచారం అందించి, ప్రత్యేకంగా ఆహ్వానించారు.పూర్వ విద్యార్థులు, దాతలు హాజరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పీటీఎం నిర్వహణ, పర్యవేక్షణ, పరిశీలన నిమిత్తం పాఠశాలకో అధికారిని నియమించారు. పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)/ పేరెంట్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ప్రైవేటు పాఠశాలలు), సిబ్బందితో కలిపి ప్రారంభించే మెగా పీటీఎంలో స్వాగతం నుంచి ఆ రోజున నిర్వహించే 50 అంశాలను వీరు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

ఫ మెగా పీటీఎం ఇలా

ఉదయం 9-11 గంటలు

విద్యార్థుల సంక్షేమం, అభ్యసనా సామర్థ్యాల పెంపు, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు, పొందుతున్న లబ్ధి తదితర అంశాలపై సమీక్ష.మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్‌ క్రైం, సోషల్‌ మీడియా అంశాలపై అవగాహన కల్పించడం.

ఉదయం 11- 11.20 గంటలు

ఆటల పోటీలు

11.30 గంటలు

ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సమావేశం.

అమ్మపేరుపై మొక్క

4నుంచి టెన్త్‌ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం.

ఇలా జిల్లావ్యాప్తంగా 98,443 మొక్కలు నాటడం లక్ష్యం.

Updated Date - Jul 10 , 2025 | 02:05 AM