సంతృప్తికరంగా వాహనసేవల వీక్షణ
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:10 AM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీఽధుల్లోని గ్యాలరీల్లోకి చేరే భక్తులకు సంతృప్తికర వాహనసేవల దర్శనం కల్పించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం. నిర్దేశించిన సమయానికి వాహనసేవలు నిర్వహించేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాం.
మాడవీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఆంధ్రజ్యోతితో అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల, ఆంరఽధజ్యోతి
‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడవీఽధుల్లోని గ్యాలరీల్లోకి చేరే భక్తులకు సంతృప్తికర వాహనసేవల దర్శనం కల్పించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం. నిర్దేశించిన సమయానికి వాహనసేవలు నిర్వహించేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాం. చిన్నపాటి సమస్యకు కూడా అవకాశమివ్వకుండా సూక్ష్మస్థాయిలో ప్లాన్‌ను సిద్ధం చేశాం. తిరుమలకు చేరుకుని గ్యాలరీల్లోకి రావడమే భక్తుల వంతు. మిగిలినదంతా మేమేం చూసుకుంటాం’ అని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్ల వివరాలు ఆయన మాటల్లోనే..
సాంకేతిక సాయంతో రద్దీ నియంత్రణ
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఇస్రో సేవలను ఉపయోగించుకోబోతున్నాం. అలాగే భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఈసారి ఎల్‌అండ్‌టీ కూడా తమ సహకారం ఇవ్వబోతోంది. ఎంతమంది తిరుమలకు చేరినా ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశాం.
పక్కా ప్రణాళిక
ఈ తొమ్మిదిరోజుల ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఇప్పటికే అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి పక్కా ప్రణాళికలతో సూచనలు చేశాం. ముందస్తుగా తయారు చేసిన ప్లాన్ ప్రకారమే అన్నిటినీ అమలు చేయబోతున్నాం.
గట్టి భద్రత
4,700 మంది పోలీసులు, 2 వేల మంది విజిలెన్స్, వెయ్యిమంది టీటీడీ ఉద్యోగులు, 3,500 మంది శ్రీవారిసేవకులు, 2,100 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇలా పదివేల మందికిపైగా భక్తులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
గరుడసేవపై ప్రత్యేక దృష్టి
ప్రఽధానంగా గరుడసేవకు ఎలాంటి సమస్యల ఉత్పన్నం కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్యారీల్లోకి చేరే భక్తులే కాకుండా వెలుపల ఉండే యాత్రికులకూ ఎలాంటి సౌకార్యలు కల్పించాలనే అంశంపై దిశానిర్దేశం చేశాం. సరైనా కోఆర్డినేషన్‌తో స్వామి ఉత్సవాలను సక్సెస్ చేస్తాం.