కాణిపాకంలో నేడు సంకటహర గణపతి వ్రతం
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:14 AM
సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు వ్రతాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు
ఐరాల(కాణిపాకం), జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సోమవారం సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ ఆదివారం తెలిపారు. పౌర్ణమి గడిచిన 4వ రోజున ఆలయ ఆస్థాన మండపంలో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు వ్రతాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. వ్రతంలో నిర్వహించదతలచినవారు రూ.350 చెల్లించి పాల్గొనవచ్చన్నారు. రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈనెల 22న ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న మణికంఠేశ్వరాలయంలో సాయంత్ర ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రదోష కాల పూజలు జరుగుతాయన్నారు.