Share News

మేనకూరు సెజ్‌లో త్వరలో సంగం డెయిరీ

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:17 AM

: మేనకూరు సెజ్‌లో త్వరలో సంగం డెయిరీ ప్రారంభించనున్నట్లు చైర్మన్‌, ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర తెలిపారు. శనివారం రాత్రి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

మేనకూరు సెజ్‌లో త్వరలో సంగం డెయిరీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు దూళిపాళ నరేంద్ర, విజయశ్రీ

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మేనకూరు సెజ్‌లో త్వరలో సంగం డెయిరీ ప్రారంభించనున్నట్లు చైర్మన్‌, ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర తెలిపారు. శనివారం రాత్రి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సహకారంతో భూమిని సేకరించి 2 లక్షల నుంచి 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో డెయిరీ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో డెయిరీ ద్వారా లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం లో సంగం డెయిరీ ప్రారంభిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు శివప్రసాద్‌, సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్‌ ఆకుతోట రమేష్‌, టీడీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, రఫి, సంచి కృష్ణయ్య, పెసల కిషోర్‌బాబు, అశోక్‌రెడ్డి, విజయకుమార్‌ నాయుడు, ప్రసాద్‌నాయుడు, సుబ్బారావు, నిత్యకృష్ణారెడ్డి, రవి, చెంగయ్య, భాస్కర్‌, చెంచయ్య, అవధానం సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 01:17 AM