మళ్లీ ఇసుక తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:38 AM
ఎక్స్‌కవేటర్‌ను సీజ్ చేసిన అధికారులు

శ్రీకాళహస్తి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మళ్లీ మళ్లీ ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతోంది. తొట్టంబేడు మండలం విరూపాక్షిపురం, పెన్నలపాడులో గతంలో యంత్రాలతో ఇసుకను తవ్వి తరలించారు. దీనిపై రైతుల నుంచి అధికారులకు పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో సుమారు నెలపాటు ఇసుక తవ్వకాలు ఆగాయి. మళ్లీ ఐదు రోజుల కిందట కొందరు ఇసుకాసురులు ఇక్కడ నదిలో ఏకంగా మళ్లీ ర్యాంప్, రోడ్డును దర్జాగా ఏర్పాటు చేసుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాలతో మళ్లీ అక్రమ తవ్వకాలు చేపట్టారు. దీంతో మళ్లీ సోమవారం స్థానిక రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తొట్టంబేడు ఎస్‌ఐ ఈశ్వరయ్య... పెన్నలపాడు రీచ్ వద్దకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకుని తహసీల్దారు అప్పగించినట్లు తెలిపారు. ఇక్కడ కఠిన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే గడచిన 8 నెలల కాలంలో ఇప్పటికీ పదేపదే అదే తంతు సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.