ఎస్‌ఎస్ లింక్ కెనాల్ లిఫ్ట్ పనులకు మోక్షం
ABN , Publish Date - Jul 10 , 2025 | 02:14 AM
జిల్లాకు మేలు చేసే ఎస్‌ఎస్ లింక్ కెనాల్, మామిడి రైతులకు సబ్సిడీ చెల్లింపుతో పాటు తిరుపతిలో తెలుగుంగ ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలను బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకుంది. ఫ జిల్లాలో ఆరున్నరేళ్లుగా పెండింగులో ఉన్న సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ పనులకు 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.292.66 కోట్లకు పరిపాలనా మంజూరు లభించింది. హైదరాబాదుకు చెందిన మెస్సర్స్ ఎంఈఐఎల్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. అదే ఏడాదిలోనే రూ. 250.51 కోట్లతో అగ్రిమెంట్ ఖరారైంది. ఈ నిధులతో మేర్లపాక చెరువు నుంచీ మల్లిమడుగు రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు కెనాల్, లిఫ్ట్ నిర్మాణాలు చేపట్టాలి. నిర్మాణ సంస్థ పనులు చేపట్టి 12.22 శాతం పనులు పూర్తి చేసింది. దానికోసం రూ.30.61 కోట్లు ఖర్చు చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో గత వైసీపీ ప్రభుత్వం ఈ పనుల టెండర్లను రద్దు చేసింది. ఆ తర్వాత టెండర్లు పిలవకపోవడంతో పనులు ఆగిపోయాయి. పనులు పూర్తి చేయడానికి రూ.219.90 కోట్లు, భూసేకరణ తదితర ఖర్చుల కోసం రూ.64 లక్షలు కావాలి. తాజాగా మంత్రివర్గం ఈ పనులు చేపట్టేందుకు అనుమతివ్వడంతో త్వరలో పనులు మొదలు కానున్నాయి.
తిరుపతిలో టీజీపీ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి అనుమతి
మామిడి మద్దతు ధరకు రూ.260 కోట్లు మంజూరు
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
తిరుపతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు మేలు చేసే ఎస్‌ఎస్ లింక్ కెనాల్, మామిడి రైతులకు సబ్సిడీ చెల్లింపుతో పాటు తిరుపతిలో తెలుగుంగ ప్రాజెక్టు గెస్ట్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి నిర్ణయాలను బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకుంది.
ఫ జిల్లాలో ఆరున్నరేళ్లుగా పెండింగులో ఉన్న సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ పనులకు 2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.292.66 కోట్లకు పరిపాలనా మంజూరు లభించింది. హైదరాబాదుకు చెందిన మెస్సర్స్ ఎంఈఐఎల్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. అదే ఏడాదిలోనే రూ. 250.51 కోట్లతో అగ్రిమెంట్ ఖరారైంది. ఈ నిధులతో మేర్లపాక చెరువు నుంచీ మల్లిమడుగు రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు కెనాల్, లిఫ్ట్ నిర్మాణాలు చేపట్టాలి. నిర్మాణ సంస్థ పనులు చేపట్టి 12.22 శాతం పనులు పూర్తి చేసింది. దానికోసం రూ.30.61 కోట్లు ఖర్చు చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో గత వైసీపీ ప్రభుత్వం ఈ పనుల టెండర్లను రద్దు చేసింది. ఆ తర్వాత టెండర్లు పిలవకపోవడంతో పనులు ఆగిపోయాయి. పనులు పూర్తి చేయడానికి రూ.219.90 కోట్లు, భూసేకరణ తదితర ఖర్చుల కోసం రూ.64 లక్షలు కావాలి. తాజాగా మంత్రివర్గం ఈ పనులు చేపట్టేందుకు అనుమతివ్వడంతో త్వరలో పనులు మొదలు కానున్నాయి.
ఫ తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో తెలుగు గంగ ప్రాజెక్టు అతిథి గృహం నిర్మాణానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5.46 కోట్లు మంజూరు చేసింది. మెస్సర్స్ ఐ.మునిమోహన్‌రెడ్డి అండ్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ప్రభుత్వం మారడంతో ఆలస్యంగా 2023 డిసెంబరులో అగ్రిమెంట్ ఖరారైంది. రూ.3.78 కోట్లతో చేపట్టాల్సిన పనులు కేవలం రూ.41 లక్షల మేరకే జరిగాయి. ఆ మొత్తాన్నీ కాంట్రాక్టు సంస్థకు చెల్లించలేదు. తిరిగి పనులు మొదలుపెట్టేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది.
మామిడి సబ్సిడీ కింద రూ.260 కోట్లు
ప్రస్తుత సీజనులో ఉమ్మడి చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి రైతులు ధరల పతనంలో నష్టపోకుండా ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.260 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో 76,700 మంది రైతులు 80 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి సాగు చేస్తున్నారు. ఈ సీజనులో 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చింది. ఈ మొత్తం సేకరణకుగానూ కిలోకు రూ.4 వంతున సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం దానికోసం రూ.260 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి జిల్లా వరకూ చూస్తే 14,582 హెక్టార్లలో తోతాపురి సాగవుతోంది. ఆ మేరకు 1.45 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈనెల 5వ తేదీ నాటికి జిల్లాలో 10,046 మంది రైతులకు చెందిన 67,988.68 టన్నుల తోతాపురి సేకరించడం జరిగింది. దానికి గానూ రైతులకు సబ్సిడీ కింద రూ. 27.18 కోట్లు చెల్లించాల్సి వుంది. మొత్తం తోతాపురి మామిడి సేకరణ పూర్తయితే సబ్సిడీ కింద రూ. 58 కోట్లు ప్రభుత్వం నుంచీ రైతులకు అందుతుంది.