Share News

పాత బిల్లులకు మోక్షం

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:37 AM

జిల్లా పరిషత్‌ పరిధిలో వివిధ గ్రాంట్లకు సంబంధించి 2018-19నడుమ చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు మోక్షం లభించింది.

పాత బిల్లులకు మోక్షం

రూ.7.82 కోట్లు నిధుల విడుదల

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పరిధిలో వివిధ గ్రాంట్లకు సంబంధించి 2018-19నడుమ చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు మోక్షం లభించింది.గత వైసీపీ ప్రభుత్వం ఈ బిల్లులను మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే.అయితే ఇన్నాళ్లకు మళ్లీ కూటమి ప్రభుత్వంలోనే ఆ బిల్లులకు మోక్షం లభించింది. రూ.5 లక్షల లోపున్న సుమారు 372 పనులకు సంబంధించి రూ.7,82,63,253 నిధులను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు తెలిపారు.దసరా కానుకగా బిల్లులు మంజూరు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంట్రాక్టర్లు, సర్పంచులు, టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి బిల్లులతో పాటు ప్రస్తుతం చేసిన రూ.5 లక్షల లోపు పనులకు సంబంధించిన బిల్లులనూ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తాన్ని సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు,ఎంపీడీవోల ఖాతాలకు జమచేయడం జరిగిందని, పనులు చేసిన వారు ఈఈలను, ఎంపీడీవోలను సంప్రదించాలని జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు తెలిపారు.

Updated Date - Oct 02 , 2025 | 01:37 AM