రష్యన్ భక్తుల రాహుకేతు పూజలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:04 AM
శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం సుమారు 29మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు.
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని మంగళవారం సుమారు 29మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు. ముందుగా వారు రూ.500 రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనంతో మానసిక ప్రశాంతత కలిగిందన్నారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి