Share News

ఇసుక ట్రాక్టర్‌ను అధిగమించబోయి ఆర్టీసీ బస్సుల ఢీ

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:50 PM

పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లె వద్ద మంగళవారం ఇసుక ట్రాక్టర్‌ను అధిగమించబోయి రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఇసుక ట్రాక్టర్‌ను అధిగమించబోయి  ఆర్టీసీ బస్సుల ఢీ
ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు

పుంగనూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు సమీపంలోని గూడూరుపల్లె వద్ద మంగళవారం ఇసుక ట్రాక్టర్‌ను అధిగమించబోయి రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.పోలీసుల కథనం మేరకు... పలమనేరు డిపోకు చెందిన బస్సు పెద్దపంజాణి వైపు వెళుతున్న ఇసుకు ట్రాక్టర్‌ను అధిగమించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది.పెద్దపంజాణి మండలం దాసార్లపల్లెకు చెందిన డ్రైవర్‌ శ్రీధర్‌ (28), కదిరికి చెందిన అఫీజ్‌ఖాన్‌ (60), పుంగనూరుకు చెందిన నాగమణి(55), రామసముద్రం మండలం కేసీపల్లెకు చెందిన రమణ(37), పలమనేరుకు చెందిన శివప్రసాద్‌(42), ఎర్రగుట్లపల్లెకు చెందిన పి. వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాంపల్లె నారాయణస్వామి (36)తోపాటు బస్సుల్లోని పుంగనూరు ఏఎ్‌సఐ అశ్వర్థనారాయణ, లక్ష్మీదేవి, డ్రైవర్‌ మస్తాన్‌, శ్రీవిద్య, పవిత్ర, ఎల్లప్ప, చరణ్‌, అభిలాష్‌, నిఖిల్‌, అశోక్‌ ,అరుణ,అమరనాథరెడ్డి, ఎన్‌.శివప్ప, నాగమణి, శ్రీనివాసులు, హేమలత, జియాన్‌, వసంతమ్మ గాయపడ్డారు. పోలీసులు 108 వాహనాల్లో క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్డీవో భవాని, పుంగనూరు తహసీల్దార్‌ రాము, ఎంవీఐ సుప్రియ, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు హరిప్రసాద్‌, కేవీ.రమణ, పుంగనూరు, పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్లు దినేశ్‌, అల్తాఫ్‌ గాయపడిన వారిని పరామర్శించారు.టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి సూచనతో క్షతగాత్రులకు ఆస్పత్రిలో టీడీపీ నేతలు ఆర్థిక సహాయం అందజేశారు. పుంగనూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శమిపతి, మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీకాంత్‌, సీవీరెడ్డి, పోలీసు గిరి, అంజుమాన్‌ కమిటీ కార్యదర్శి ఇబ్రహీం క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందజేశారు.కూటమి పార్టీల నాయకులు కోలాట వెంకటరమణ, గంగాధర్‌, చైతన్యరాయల్‌, నరేశ్‌రాయల్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:50 PM